అయోధ్య రామ మందిరం
రామ మందిరం బాబ్రి మసీదు: ఒకప్రక్క బి.జె.పి పార్టి రామ మందిర నిర్మాణార్ధం పురాతన బాబ్రి మసీదు కూల్చివేయడం ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేయడమేనని ప్రకటించిన తరువాత కూడా అద్వాని విచారం వ్యక్తం చేయడం హాస్యస్పదంగా ఉంది. ఇలా చారిత్రకంగా మతపరమయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
బి.జె.పి వాటిని సరిచేయడానికి ముందుకు వస్తుందా? 1) టిప్పు సుల్తాన్ (Tipu Sultan) తన మైసూరు మహారాజుగా ఉన్న సమయంలో శృంగేరి మఠంలో ఉంచడానికి సరస్వతీ విగ్రహం తయారు చేయడానికి బంగారం దానం చేశాడు. ఆ విగ్రహాన్ని 1761లో మరాఠా ముఠాలు దొంగిలించి, కరిగించి బంగారం పంచుకున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు బి.జె.పి ఆ బంగారాన్ని శృంగేరి మఠానికి అందిస్తుందా? (Ram Janmabhumi)
2) దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో, వెయ్యి సంవత్సరాల క్రితం జైన మరియు భౌద్ధ ఆలయాలు, హిందూ ఆలయాలుగా మారాయి. ప్రస్తుతం వీటిని జైనులకు మరియు భౌద్ధులకు అందించాలా?
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
బాబ్రి మసీదు కూల్చిన తర్వాత ఇంగ్లాండులో మరియు పాకిస్తానులో హిందు దేవాలయాలను అపవిత్రం చేయడం లేదా విధ్వంసం చేయడం జరిగింది. ఇలాంటి విదేశాల్లో జరిగిన ప్రతి చర్యకు హిందూ అతివాదులు బాధ్యత వహిస్తారా? అలాగే బోంబాయి వంటి ప్రదేశాల్లో జరిగిన నరమేధం కూడా వీరి పాపంగా పరిగణించాలి కదా? అందువల్ల, హింసకు హింస సమాధానం కాదు. ప్రజాస్వామ్య పద్ధతులను వదిలి హింసను ప్రధాన ఆయుధంగా ఉపయోగించే రాజకీయ పార్టీలు భారతీయ సమాజంలో ఎక్కువ కాలం నిలబడవు.
This letter was written by me, D V S Janardhan Prasad, in The Indian Express daily on 21.01.1993.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )