కులాల రాజకీయములు
హిందు ధర్మ శాస్త్రములలో ఎక్కడా కూడా కులముల ప్రసక్తి లేదు. ప్రస్తుత సమాజములో మనబడే కులములు అన్నీ రాజకీయ కులములు అని గమనినిచాలి. శాస్త్రములలో వర్ణ ము గోత్రముల ప్రస్తకి మాత్రమే ఉంది.
వర్ణములు వృత్తి ఆధారంగా విభజించబడ్డాయని విశ్లేషకులు పేర్కొంటారు. ప్రస్తుతానికి కులం అనే పదం ఒక ప్రాంతానికి సంబంధించిన సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. సంస్కృతంలో కులం అంటే ఇంటి కప్పు లేదా అంతస్తు అని అర్థం. అందువల్ల, ఒక కుటుంబాన్ని కొన్నిసార్లు ఒక కులంగా పరిగణించబడేది. అలాగే, ఒక గ్రామంలో నివసించే వారిని అందరినీ ఒకే కులంగా పిలవడం కూడా జరుగుతుంది.
ప్రస్తుతం కులాలుగా పరిగణించబడుతున్న సామాజిక వర్గాలు అన్నీ జాతుల దృష్టిలో కలగూర గంపలే. ఒక కులంలో వివిధ ఇంటిపేరుల వ్యక్తులు ఉంటారు. ఒకే ఇంటి పేరుతో వివిధ కులాల వ్యక్తులు కూడా ఉంటారు. ఒక ఇంటి పేరు ఒక ప్రాంతంలో ఒక వృత్తిని అవలంబిస్తుంటే, వేరే చోట వేరే వృత్తిలో ఉంటారు. ఒకే కులానికి చెందిన వారు కూడా ఇంటిపేరుల ఆధారంగా ఒకరికొకరు వ్యతిరేకతను ప్రదర్శిస్తూ, మాత్సర్యాలు చేస్తుంటారు. ప్రస్తుతం సాధారణంగా ఇంటిపేరు ఆధారంగా ఒకరి కులాన్ని మనం ఊహించుకుంటున్నాం. ఇంటిపేరు నిర్ధారణ అయిన తర్వాత, ఏ ప్రాంతంలో వాడా అని పరిశీలిస్తాము.
ఇంటి పేరులు కుల వ్యవహారంలో ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. ఇంటి పేర్ల గురించి ఏ ధర్మ శాస్త్రంలోనూ ప్రస్తావన లేదు. పూర్వ కాలంలో ఒక వ్యక్తిని పిలిచేటప్పుడు, వారు ఫలానా వాని కొడుకు, మనుమడు లేదా అల్లుడు అని సూచించేవారు. మత సంబంధిత కార్యక్రమాలలో గోత్రమును ప్రస్తావించేవారు. అయితే, ఇంటి పేరులు ఎలా ఏర్పడినవి? (తమిళనాడులో తండ్రి పేరు ఇంటి పేరుగా వ్రాయబడుతుంది.) ఇక ఆధునిక కులాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో చూద్దాం!
బ్రిటిషు కాలంలో భారత ప్రభుత్వము 1881 నుండి జనాభా లెక్కల సేకరణను ప్రారంభించింది. మొదట పట్టణాలలో, తరువాత మొత్తం బ్రిటిషు పాలనలో ఉన్న ప్రాంతాలలో ఈ జనాభా గణన 1941 వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగింది. ఈ ప్రక్రియలో కులాన్ని కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంటి పేరు కూడా నమోదు చేయడం జరిగింది. మన దేశంలో ఇంటిపేరు వ్రాసుకునే సాంప్రదాయం పూర్వం లేదు. ఇది జనాభా లెక్కలతోనే ప్రారంభమైంది. అంటే, ఇంటిపేరు వ్యవస్థకు కేవలం వంద సంవత్సరాల వయస్సు మాత్రమే ఉంది. ఇంటి పేర్ల ఆధారంగా ఉన్న కులాల పేర్లకు కూడా అంతే వయస్సు ఉంది!
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
ఇంటి పేర్లను వ్రాసుకునే సాంప్రదాయం మనది కాదు. ఒకరి ఊరి పేరు లేదా ఒకరి పూర్వపు ఊరి పేరు అంటే, పూర్వంలో అతను లేదా అతని పూర్వీకులు ఏ ప్రాంతం నుండి వలస వచ్చారో, లేదా ఒకరి వృత్తి, వారి పూర్వీకుల వృత్తి, లేదా ప్రస్తుత నివాసం ఉన్న స్థలానికి సంబంధించిన పేరు ఇలా ఏదో ఒకటి ఇంటి పేరుగా జనాభా లెక్కల సేకరణ సమయంలో వ్రాసారు. అంటే, ఇంటి పేర్లు అన్నీ కృత్రిమమైనవేనని అర్థం.
కులాల పేర్లు ఎంత మిధ్యనో ఇంకా కొన్ని విషయాలను గమనిస్తే తెలుస్తుంది. రాజు పదంతో ముగిసే ఇంటి పేర్లు బ్రహ్మణ కులంలో చాలా ఉంటాయి. అలాగే, రెడ్డి తో ముగిసే ఇంటి పేర్లు కాపు, కమ్మ, హరిజన కులాలలో ఎక్కువగా ఉంటాయి. అట్లాగే, ఒక్కొక్కరు తమ కుమారులకు వారి కులం కాని వేరే (అన్య) కులం పేరు పెట్టడం కూడా చూడవచ్చు.
కొంతమంది ఇంటిపేర్ల ద్వారా వారు ఏ ప్రాంతం నుండి వలస వచ్చారో అర్థం అవుతుంది. ఒకే ఇంటి పేర్లు వివిధ కులాలకు చెందినవి. ఉదాహరణకు, వడ్డి ఇంటిపేరు ఒడిసా ప్రాంతానికి చెందినదని మనం తెలుసుకుంటాము. ప్రస్తుతం వడ్డి ఇంటిపేరు కలిగిన వారు అందరూ తెలుగు మాట్లాడుతారు. అయితే, వీరి పూర్వీకులు ఒరిస్సా నుండి వలస వచ్చారు. వీరు వివిధ కులాలకు చెందినవారు.
ఈ చర్చలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కుల వ్యవస్థ మరియు వర్ణ వ్యవస్థ వేరు. ఇంటి పేర్ల ద్వారా కుల వ్యవస్థ ఏర్పడింది. కుల వ్యవస్థకు శాస్త్రపరమైన సమ్మతి లేదు. జాతుల పరంగా చూస్తే, అన్ని కులాలు కలగూర గంపలే.
ప్రస్తుతం మేము ఒక కులంగా భావిస్తున్న వ్యక్తులు తరతరాలుగా ఒకే కులానికి చెందిన వారు అనేది ఒక మిథ్య. కొన్నిసార్లు ఒక కుటుంబం పేరు ఒక కులంగా భావించబడితే, వివిధ కుటుంబాల పేర్ల కలయిక ఒక కులంగా మారిందని భావించవచ్చు. అలా కులాలన్నీ వేరు వేరు కులాల కలయిక ద్వారా ఏర్పడినప్పుడు, ప్రస్తుత కులాంతర వివాహాలు జరుగుతున్నాయి అనేది ఒక సామాజిక చైతన్యం అని భావించడం ఒక జోక్. కులాల ఆధారంగా సమాజం విభజించబడిందని పూర్తిగా నమ్మడం లేదు. వర్ణం, గోత్రం.
రాజకీయ పార్టీలు కులాల ఆధారంగా ఓట్లను లెక్కిస్తాయి. కానీ వాస్తవానికి కులాల మరియు మతాల ఆధారంగా ఓట్లు పడవు.
నాకు ఎన్నికల అనుభవం ఉంది. కులాల ఆధారంగా ఓటింగ్ జరగడం చాలా అరుదు. ఒక కుటుంబంలోని సభ్యులు అందరూ ఒకే పార్టీకి ఓటు వేయరు. అలాగే, భార్య ఒక పార్టీకి ఓటు వేస్తే, భర్త వేరే పార్టీకి ఓటు వేయవచ్చు. మరి ఎవరు గెలుస్తారు? అంటే, గెలిచే వారు అధిక మెజారిటీతో గెలుస్తారు. అంటే, చాలామంది ఓటర్లు తమ ఓటును వృథా చేయడానికి ఇష్టపడరు. అందువల్ల, ఎన్నికల రోజుకు కొన్ని రోజుల ముందు, ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ గెలుస్తుందో ఓటర్లు అంచనా వేస్తారు. గెలిచే వారికి మాత్రమే ఓట్లు వేస్తారు. ఇక్కడ కులం అంశం పనిచేయదు.
ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది కులం అనే సామాజిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ప్రజలకు మానసిక ఉత్సాహం కలిగించడానికి, కొన్నిసార్లు ఆర్థిక లబ్ధి పొందడానికి కుల గుర్తు ఉపయోగపడవచ్చు. అయితే, నాయకులకు కుల పిచ్చి ఉండదు. కులాభిమానమూ ఉండదు. ఏ నాయకుడు కూడా తన స్వంత కులస్తులను నమ్మడు. ఎం టీ ఆర్ శ్రీనివాసులు రెడ్డి ముందుగా చేరదీసిన వ్యక్తి. చివరికి అల్లుడిపై వాలాడు. ప్రస్తుతం చంద్రబాబు తన కులంలో ఎవ్వరినీ దగ్గరికి చేరనివ్వరు. అవసరం వస్తే కొడుకునో బావమరిదినో సీఎం చేస్తాడు, కానీ తన కులంలో వేరొకరిని సీఎం అవ్వనివ్వడు.
ఇందిరా గాంధి తన కొడుకులను చెరదీసినప్పటికీ, తన కులాన్ని వారిని విడిచిపెట్టలేదు.
చిరంజీవికి తన తమ్ముడు తప్ప, తన కులస్తులలో ఎవరూ నాయకులుగా కనిపించలేదా? తానయినా, తన తమ్ముడైన ఒకరు వ్రాసిన స్క్రిప్ట్‌ను చదవడం కదా?! తమ్ముడుతో తప్ప, తన కులంలో వేరే ఎవరితోనూ అన్యులు వ్రాసిన స్క్రిప్ట్‌ను చదవకూడదా?!
ఎవరైనా సరే – కరుణానిధి, థాకరే, ములాయం వంటి వారు కులాన్ని కుల జనాన్ని వాడుకుంటారు, కానీ తమ కులంలోని వారి ప్రతిభను గుర్తించరు, పెంచరు.
రాజకీయ కుల సమీకరణాలు నాయకులకు మరియు వారి కుటుంబాలకు భజన సమాజాలుగా మాత్రమే ఉంటాయి. ఫలాన వాడు తమ వాడు అని అనుకోవడం వల్ల ఆ కులానికి వారికి మానసిక ఆనందం, సమాజంలో ప్రతిపత్తి పెరుగుతుంది. అధికారము మాత్రం ఒక వ్యక్తి కుటుంబంలోనే ఉంటుంది. – జనార్ధన ప్రసాద్.