ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?

Rate this page

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?

ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?: లోక్ సభ మరియు రాజ్య సభలలో అణు ఒప్పందం విషయమై ప్రభుత్వం పార్చలమెంటు లో చర్చను అనుమతించడము లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కు ఇది ప్రమాదకరము.

అమెరికా దేశ ఆదేశాలను సిరసా అనుసరించే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వం పాటించడానికి ఉర్రూతలూగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం సంబంధిత వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

(ఈ విశేషాంశం గురించి ముఖ్యమైన తెలుగు, ఇంగ్లీష్ వార్తా పత్రికలకు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ టి.వి చానళ్లకు 21.09.07 తేదీన పంపించబడింది.)

ఈ విధానం వల్ల దేశానికి ఏ దుస్థితి ఏర్పడుతుందో హెన్రి కిస్సింజర్ అనే పూర్వ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో చూద్దాం. ఆయన ఏమనుకుంటున్నారంటే, “అమెరికా దేశం ఏ దేశంతో స్నేహం చేస్తుందో, ఆ దేశాన్ని అమెరికా సైనికంగా ఆక్రమిస్తుంది”. ఈయన చెప్పిన మాటలు ఎల్లప్పుడూ అన్ని దేశాల విషయాలలో నిజమవుతాయని చరిత్ర నిరూపిస్తుంది.

అమెరికాతో చేతులు కలిపితే ఏమవుతుందో తెలిసి కూడా ప్రభుత్వం పార్లమెంటును ఎలా త్రోసిరాజని ముందుకు తీసుకువెళ్లగలుగుతుంది? ప్రభుత్వానికి ఇంతటి నిరంకుశ అధికారాలు రాజ్యాంగ పరంగా ఎలా దఖలు పడ్డాయో పరిశీలిద్దాం.

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము.)

భారతదేశం ఒక గణతంత్రం, ప్రజాస్వామ్య రాజ్యాంగం 1950లో ఏర్పడింది.

భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రు గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఏమన్నారంటే, “మన ప్రజాస్వామ్యం బ్రిటిష్ వారి వెస్ట్ మినిస్టర్ వ్యవస్థకు సమానంగా ఉంటుంది”. అంటే, కేంద్ర మంత్రులు మరియు ప్రధాన మంత్రి పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి.

ఈ చట్టం 1940 లో అమలులోకి వచ్చింది. అయితే, పైన పేర్కొన్న విధంగా అప్పటి కాంగ్రెసు సభ్యులు రాజీనామాలు చేసి, దేశానికి ఏ విధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు రాబోతోందో ప్రజలకు చూపించారు అనేది గమనించాల్సిన విషయం.

మన పూర్వీకులు ఎంత గొప్ప ప్రజాస్వామిక విలువలను మనకు వారసత్వంగా అందించారు! ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు, పార్లమెంటు సభ్యులు కళ్ళు మూసుకుని చూస్తున్నారు. పార్లమెంటుకు ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ అధ్యక్షులకు విధేయులుగా పదవులను కాపాడుకోవడమే తమ జీవితం యొక్క ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.

ఇక్కడ మరో అంశం గమనించాల్సినది. మన ప్రస్తుత రాజ్యాంగం ఆర్టికల్ ౧౩ ప్రకారం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పూర్వపు చట్టాలు ఏవైనా రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు. అంటే, కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటును తలదన్నే అధికారాలు ఏమి చెల్లవు.

పార్లమెంటులో మూడవ వంతు సభ్యులున్న పార్టీ దేశ రక్షణ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహారం నడిపించడం, దేశ రాజకీయ దుస్థితికి నిదర్శనంగా భావించవచ్చు.