పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము

Rate this page

పార్టీ ఫిరాయింపులు

రాజకీయ పార్టీ అధినేతల నియంత్రుత్వ ధోరణికి మూలము, బలము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము అని నా అభిప్రాయము. అందువల్ల, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయకపోతే, మన ఎంపీలు మరియు ఎంఎల్యేలు పార్లమెంటు మరియు అసెంబ్లీలో స్వతంత్రంగా వ్యవహరించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవడం సాధ్యం కాదు. 4.10.13 తేదీకి ముందు రాత్రి, కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలిలో రాష్ట్రాన్ని విభజించడానికి, అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి పూర్వ హైదరాబాదు రాష్ట్రాన్ని విడదీసి వేరే రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు న్యూఢిల్లీలో ప్రకటించారు.

దీని ఫలితం ఏమిటంటే, ముందుగా విభజన ప్రతిపాదనను దేశాధ్యక్షునికి పంపించబడుతుంది.

ఆయన ఆ ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీకి పంపించనున్నారు. ఒకవేళ అసెంబ్లీ ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే, వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడతారు.

హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి తీర ఆంధ్ర జిల్లాల వారీగా ఉద్యోగ అవకాశాల విషయంలో సయొధ్య కుదిర్చిన ఆర్టికల్ 371 డి రాజ్యాంగంలో భాగంగా రాష్ట్ర విభజన ప్రతిపాదన అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కదా!

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )

ఒకవేళ ఆర్టికల్ 371 డి ను రాజ్యాంగం నుండి తొలగించాలంటే, పార్లమెంటులో 2/3 వంతుల మెజార్టీ అవసరం. పార్లమెంటు మరియు అస్సెంబ్లీ లో తీర్మానం పాస్ చేయడానికి అనేక రాజకీయాలు జరుగుతాయి. కొందరు ఎమ్ ఎల్ ఏ లు మరియు ఎం పీ లు సభకు హాజరుకాకుండా తీర్మానాన్ని నెగ్గవచ్చు. ఎందుకంటే, అస్సెంబ్లీ లో హాజరైన వారి ఓట్లలో మెజారిటీ సాధించినప్పుడు, తీర్మానం నెగ్గుతుంది. కొందరు ఎమ్ ఎల్ ఏ లు మరియు ఎం పీ లు ఇప్పటికే రాజీనామా చేసి, వారు ఓటు వేయడానికి అర్హత కోల్పోయి ఉంటే, వారి ఓటు తీర్మానానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల అధికార పార్టీకి మేలు జరుగుతుంది. అంటే, ఒక విధంగా విభజనను వ్యతిరేకిస్తున్నామని చెప్పి రాజీనామా చేసిన వారు, ఓటు వేయకపోవడం ద్వారా విభజన తీర్మానాన్ని బలపరిచినవారుగా మారుతారు.

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

చట్ట సభలలో హాజరైన వ్యక్తులు ఓట్లు ఎలా వేస్తారో తెలియదు. తీర్మానాలను గెలిపించేందుకు కాంగ్రెసు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అధిపతులు ఈ అంశంపై ఒక నిర్ణయానికి చేరుకున్నారని నేను భావిస్తున్నాను. ఎమ్ ఎల్ ఏలు, ఎం పీలు పార్టీ నిర్ణయాలను నిజాయితీగా విరోధించగల శక్తి ఉన్నవారు కనిపించడం లేదు.

ఎవరైతే నిజంగా సమైక్యం వైపు ఉన్నారో, ఎవరు విభజనకు భజన చేస్తున్నారో, అందరికి స్పష్టంగా అర్థమవుతోంది.

ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు కుటిల రాజకీయాలను ఎలా నిలువరించగలరు?

విభజనను విజయవంతంగా ఎదుర్కొనడం ఎలా అనేది ప్రధాన సమస్య. ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు పార్టీ అధిష్టానానికి బానిసలుగా ఎలా మారిపోయారో ఒకసారి వివరంగా పరిశీలిద్దాం.

ఒక వైపు, ఏ రాజకీయ పార్టీ కూడా తమ ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి భయపడటం లేదు.

మరొక వైపు, ఎమ్ ఎల్ ఏ లు మరియు ఎమ్ పీ లు ప్రజలు ఏమనుకుంటున్నారో, మళ్లీ ప్రజలు మనకు ఓట్లు వేస్తారో లేదో అనే భయాన్ని మానేశారు. ప్రజలు డబ్బుకు ఓట్లు వేస్తారు. పార్టీలకు ఓట్లు వేస్తారు. మమ్మల్ని చూసి కాదు. అయిదు, పది శాతం ఓట్లు విజయం నిర్ణయించగలవు. ఆ ఓట్లు ఎలా వేయాలో, వేయించుకోవాలో మాకు తెలుసు. అయినప్పటికీ, పార్టీలు టిక్కెట్లు ఇవ్వకపోతే పోటీ చేయడం అసాధ్యం. అందువల్ల, పార్టీ నిర్ణయానికి శిరసావహించడం తప్పు కాదు. ప్రజలు ఎక్కువ కాలం ఏదీ గుర్తుంచుకోరు. ఇలాంటి ఆలోచనలతో ఎమ్ ఎల్ ఏ లు మరియు ఎమ్ పీ లు ప్రజాభిప్రాయాన్ని పక్కన పెడుతున్నారా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పూర్వం ఇందిరా గాంధి మరియు నెహ్రూ కాలంలో ప్రజాభీష్టాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోబడేవి.

కానీ ఆ మహానాయకుల నిర్ణయాలు దేశానికి మేలు చేకూర్చడానికి తీసుకున్నవే, స్వార్ధ రాజకీయాలకు కాదు. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన రెండు డజన్ల ఎంపీ సీట్ల కోసం జరుగుతున్నది అని దేశమంతా స్పష్టమైంది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము

సిగ్గు పడకుండా, తీర్మానం వీగిపోతే ఎలా అనేది భయం లేకుండా ఈ విభజన ప్రక్రియను కాంగ్రెసు పార్టీ ఏ ధైర్యంతో ముందుకు తీసుకువెళ్తుంది?

28 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రాజ్యాంగ సవరణ దీనికి కారణమని నేను భావిస్తున్నాను. ఈ రాజ్యాంగ సవరణ నిజంగా మన దేశంలో ప్రజాప్రతినిధుల్ని రంగులు మార్చకుండా నియంత్రించడానికే తీసుకురావడమయినది.​
 
ఈ రాజ్యాంగ సవరణను పిరాయింపు నియంత్రణ చట్టం (Anti-defection law) అని పిలుస్తారు. ఇది మన రాజ్యాంగానికి యాభై రెండవ (52) సవరణ. ఈ చట్టాన్ని 1985 లో ప్రవేశపెట్టారు. ఈ యాభై రెండవ సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 102 (2) & 191 (2) ను సూచిస్తుంది.

ఇది రాజ్యాంగంలో 10 వ షెడ్యూల్ గా పరిగణించబడుతుంది. దీని ప్రకారం, ఒక చట్ట సభ సభ్యుడు ఏ పార్టీ టిక్కెట్ పై ఎన్నికవుతాడో, ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మాట్లాడాలి మరియు ఓటు వేయాలి. అలా కాకుండా, ఎమ్ పీ లేదా ఎమ్ ఎల్ ఏ తన స్వంత అభిప్రాయాన్ని పార్లమెంటులో లేదా అసెంబ్లీలో వ్యక్తం చేస్తే, అతన్ని పార్టీ నుండి బహిష్కరిస్తారు. ఈ విధంగా, అతను తన చట్ట సభల సభ్యత్వాన్ని కోల్పోతాడు.

ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని అనేక చర్చలు జరిగాయి. కొన్ని కోర్టు తీర్పులు కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా వెలువడినవి. రాష్ట్రాలు ఈ సవరణను అంగీకరించి తీర్మానాలు చేయలేదు.

కానీ ఈ ఆర్టికల్ అమలు కొనసాగుతూనే ఉంది.

ఈ చట్టం భారత పౌరులుగా ఎమ్ ఎల్ ఏ, ఎమ్ పీ లకు రాజ్యాంగం ప్రాథమిక హక్కుల, ఆర్టికల్ 19 (ఎ) ద్వారా అందించిన భావ వ్యక్తీకరణ స్వేచ్చను హరించింది.

అదే విధంగా, పార్లమెంటు మరియు అస్సెంబ్లీల స్పీకర్ లను రాజకీయ పార్టీ బాస్ లకు గుమాస్తాలుగా మార్చింది.

ఎన్నికైన ప్రతి ఎమ్ ఎల్ ఏ, ఎమ్ పీ తనను ఓట్లు వేసి ఎన్నుకున్న నియోజక వర్గ ప్రజలకు విస్తృతంగా ఆలోచిస్తే, దేశానికి మరియు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి తన కర్తవ్యాలను నెరవేర్చాల్సింది పోయి, రాజకీయ పార్టీ అధిష్టానం యొక్క స్వార్థ ప్రయోజనాలను తీర్చడానికి పనిచేసే విధంగా మారిపోయింది.

ఈ చట్టం వాస్తవానికి అమలులో ఉండకూడదు. ఈ చట్టాన్ని 1985 లో పార్లమెంటులో ఆమోదించారు, కానీ రాష్ట్రాలు దాన్ని రాటిఫై చేయలేదు. అంటే, ఇప్పటివరకు రాష్ట్రాలు ఈ చట్టానికి తమ ఆమోదాన్ని తెలియజేయలేదు. ఆ విధంగా చూస్తే, దీని అమలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది.

ఈ పార్టీ పిరాయింపు చట్టం మంచి ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టబడినప్పటికీ, ఇది కాలక్రమేణా మన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసింది.

ఎమ్ ఎల్ ఏలు, ఎమ్ పీలు పార్టీ అధిపతులకు బానిసలుగా మారి, ప్రజలతో పూర్తిగా దూరమయ్యారు. ప్రజాభిప్రాయానికి ఇక విలువ లేదు.

ఈ చట్టం అమలులో ఉన్నంత కాలం, మన ఎమ్ ఎల్ ఏలు, ఎమ్ పీలు పార్టీలకు బానిసలుగా వ్యవహరిస్తారు. అందువల్ల, తెలుగు ప్రజలకు పార్లమెంటు మరియు అసెంబ్లీ లో ప్రజాస్వామ్యంగా న్యాయం జరగాలంటే, ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉద్యమించాలి.

ఈ విధంగా పార్టీ పిరాయింపు చట్టాన్ని తొలగించాలనే ఉద్యమం ద్వారా, తెలుగు ప్రజలు విజయం సాధిస్తే, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుజ్జీవింప చేసినవారిగా నిలుస్తారు.

ALSO READ MY ARTICLES ON