ముల్కీ నిబంధనలు

Rate this page

ముల్కీ నిబంధనలు

ముల్కీ నిబంధనలు నైజాము రాజ్యేతర జనులకు నైజాములో ఉద్యోగ అవకాశములు లేకుండా చేయడానికి తీసుకువచ్చిన చట్టము. నిజాము ప్రభువు ముల్కి చట్టమును 1919 లో చేశాడు. ఆ రోజుల్లో హిందుస్తానీయులు,  బెంగాలీలు కొంతమంది తమిళులు కూడా నిజాం కొలువులో ఉద్యోగాలు చేసేవారు. తెలంగాణలో నివసించే ఆంధ్రులు, అంటే నైజాం ఆంధ్రులు, ఉద్యోగాలు పొందడం చాలా కష్టంగా ఉండేది. ఉత్తర భారతీయుల ప్రాబల్యం నిజాముల కొలువులో ఎక్కువగా ఉండేది.

ముల్కి సూత్రాలు ఆ కాలంలో నిజాం రాజ్యంలోని ఆంధ్రుల హక్కులను రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. (Mulki rules)

తెలంగాణాలోని ఆంధ్రులు హైదరాబాదులో ఉద్యోగాల కోసం నిజాం కాలంలో ఉద్యమించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం నిజాంలో ఉర్దు రాజ భాషగా ఉండటం. తెలుగు మాత్రమే మాట్లాడే ఆంధ్రులలో ఉర్దు భాషలో వ్రాయడం మరియు చదవడం తెలిసిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఉర్దు భాష ఆఔరంగాబాదులో జన్మించింది.

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

ఆంధ్రేతరులపై (తెలుగు మాతృభాష కాని వారి పై) వాడాల్సిన ఈ నిజాము యొక్క ముల్కి చట్టం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత కోస్తాంధ్రులను హైదరాబాదులో ఉద్యోగ అవకాశాల నుండి తప్పించడానికి ఉపయోగించడం దురదృష్టకరం.

ఉద్యోగార్థులకు ఉద్యోగ అవకాశాలలో తారతమ్యాలు ఏ దేశంలోనైనా ఉంటాయి.

వాటిని సామరస్యంగా పరిష్కరించే మార్గాలు ప్రాంతాలను, జాతులను, విడదీయడానికి వైషమ్యాలను పెంచడంలో ఈ అంశాన్ని ఉపయోగించకూడదు.

అసలు ఉద్యోగాల గురించి ఆంధ్రులు ప్రాంతాల వారిగా పోట్లాడడం ఒక సమస్యను తప్పు దారి పట్టించడమే. ఉదాహరణకు, హైదరాబాదులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు కర్మాగారాల విషయాన్ని పరిశీలిస్తే, వాటిలోని అధికారిక ఉద్యోగాలు అన్ని ఉత్తర భారతీయులు లేదా తమిళనాడు, కేరళ వారు భర్తీ చేస్తుంటారు. చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఆంధ్ర, తెలంగాణా అని మనం పోట్లాడుకుంటున్నాము. (Read Article 371D)

ఔరంగాబాదు హిందుస్థానానికి సమీపంలో ఉంది. అందువల్ల, హిందుస్థానీయులు (హిందువులు మరియు ముస్లిములు) బంగాళీలు నిజాముల పాలనలో ఎక్కువగా నివసిస్తున్నారు.