జమ్మూ & కాశ్మీరు
భారత దేశమునుండి బ్రిటిషువారిని పారద్రోలినపుడు ఇచ్చటి రాజ్యములు లేక రాజ సంస్థానములపై, కాశ్మీరు (Kashmir) తో సహా, అధికారమును ఇచ్చటి జనులకు చట్టబద్ధముగా ఒప్పజెప్పడానికి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ అనేదాన్ని ఆమోదించి అమలుపరిచారు. దానిలోని వివరాల ప్రకారం, బ్రిటిషు వారు నేరుగా పరిపాలిస్తున్న ప్రాంతాలలో ప్రజా మోద్యమైన ప్రభుత్వాలకు అధికారాన్ని బదిలీ చేయబడుతుంది.
పూర్వపు నవాబ్‌లు మరియు రాజులు బ్రిటిషు వారితో వివిధ ఒప్పందాల కారణంగా వారి సార్వభౌమాధికారాన్ని పూర్తిగా అనుభవించలేకపోయారు.
ఈ యాక్ట్ ద్వారా రాజులకు మరియు నవాబ్‌లకు వారి సార్వభౌమాధికారాన్ని తిరిగి అందించబడుతుంది.
అలా సుమారు 600 మంది చిన్నా చిలుకు రాజులు నవాబ్ లు స్వతంత్రులుగా మారడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం, వారు తమను తాము స్వతంత్రులుగా ప్రకటించి, రాజ్యాలను ఏలవచ్చు లేదా పాకిస్తాన్ లేదా ఇండియాలో విలీనమవ్వవచ్చు. ఈ ప్రక్రియ అమలులో ఉన్న సమయంలో గాంధీ నిష్క్రమించారు.
మొత్తం భారము నెహ్రూగారి మీద పడింది. ఆయన పటేల్ మరియు మీనన్ ల సహకారంతో ఈ సంస్థానాలను ఇండియాలో విలీనముచేయించగలిగారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. 1946 నాటికి చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనే సంస్థను రాజులు, నవాబ్ లు స్థాపించారు (బ్రిటిషువారి సహకారంతో).
వీరిలో చాలామంది స్వతంత్రంగా రాజ్యములు చేయడానికి కలలు కనేవారు. అప్పటికి ఇండియన్ యూనియన్ అనే దేశం లేదు అని గమనించాలి. ఈ ప్రక్రియలో ఇండియన్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ కు పటేల్ గారు సారధ్యము వహించారు. ఆయన మరియు నెహ్రు అనుయాయుడు మీనన్ సంస్థానాల విలీన అంశాలను చక్కదిద్దారు.
మీనన్, సర్దార్ పటేల్
ఇక్కడ మీనన్ లేదా పటేల్ స్వతంత్రులుగా లేరు. నెహ్రు అడుగుజాడలలో వారు తమ బాధ్యతలను నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణలు కూడా జరిగాయి. కాంగ్రెసు వివిధ సంస్థానాలలో అప్పటికే స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన బీజాలను నాటింది. నెహ్రు యొక్క వ్యక్తిత్వం, కీర్తి భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడానికి పూర్తిగా ఉపయోగపడింది.
క్రొత్త భారతదేశంలో చేరడానికి రాజులపై, నవాబులపై ప్రజలు ఒత్తిడి తెచ్చారు.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము.)
భారతదేశం యొక్క భౌగోళిక పరిమాణంలో చేరాల్సిన అన్ని రాష్ట్రాలు ఇండియన్ యూనియన్ లో చేరాయి. ఈ ప్రాథమిక పనిని పటేల్ మరియు మీనన్ నిర్వహించారు. అయితే, హైదరాబాదు మరియు కాష్మీర్ రాష్ట్రాలు ఈ ప్రక్రియలో సమస్యలుగా మారాయి. నైజాం నవాబు హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు. కాష్మీర్ మహారాజు ముస్లిముల సంఖ్య ఎక్కువగా ఉన్న సంస్థానానికి అధిపతిగా ఉన్నారు. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం, వారికి తమ ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించడానికి అధికారముంది. అంటే, వారు ఇండియాలో లేదా పాకిస్తానులో చేరవచ్చు లేదా స్వతంత్ర రాష్ట్రాలుగా కొనసాగవచ్చు. నైజాం కొంతకాలం పాకిస్తానులో చేరేందుకు చర్చలు జరిపాడు. దీనికి బ్రిటిష్ వారు మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆధారాలు ఉన్నాయి.
తదుపరి తమరాజ్యము స్వతంత్య రాజ్యముగా ప్రకటించబడింది. ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. సికందరాబాదులోని మిలిటరీ కంటోన్మెంట్ లో పూర్వపు బ్రిటిషు సేనలు, తత్కాల ఇండియా సేనలు అక్కడే ఉన్నాయి. ఈ సేనలను ఉపసంహరించడానికి ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నైజాము స్వతంత్ర రాజ్యముగా ఉన్నందున, ఇండియా సేనలు హైదరాబాదును ఆక్రమిస్తే, అది అంతర్జాతీయ నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల, హైదరాబాదుపై సైనిక చర్యకు పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఈ విషయాలు జరుగుతున్న సమయంలో, ఇండియా ఒక రిపబ్లిక్ గా ఆవిర్భవించలేదు. అప్పట్లో నెహ్రునే ఇండియా ఇండియానే నెహ్రు. ఒక విధంగా చూస్తే, ప్రజలకు నెహ్రుపై ఉన్న అభిమానము మరియు గౌరవము, ఇండియా ఆవిర్భావానికి దోహదపడినది అని తెలుసుకోవాలి. బ్రిటిషువారు అధికార సమతుల్యత అనే నెపముతో, ఇండియా ఒక ఐక్య దేశముగా నెలకొనడమునకు సహించలేకపోయారు. వీరు నైజామును స్వతంత్ర రాజ్యముగా ప్రకటించేటట్లు ప్రేరేపించారు.
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
కాష్మీర్‌లో కాష్మీరు మహారాజును పదవీచ్యుతుడిగా ప్రకటించి ప్రజాభిప్రాయాన్ని ఉపయోగించి రాజకీయాలు చేసి కాష్మీర్‌ను పాకిస్తాన్‌లో కలపడానికి ప్రయత్నించారు. బ్రిటిష్ సైనికులు, పాకిస్తాన్ సైనికులు మరియు కొంతమంది ముస్లిం అజాదీయులు కలిసి శ్రీనగర్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి, నైజాం లాగా కాష్మీరు మహారాజు కూడా స్వతంత్రంగా రాజ్యమేలాలని ఆశించాడు. అయితే, పాకిస్తాన్ సైన్యాన్ని చూసి భయపడి ఇండియాకు ఆశ్రయం కోరాడు.
పాకిస్తాన్, బ్రిటన్ మరియు అజాదీ ముస్లిముల దాడిని ఎదుర్కొనడానికి భారతదేశం చర్యలు తీసుకోవాలంటే, కాశ్మీర్‌ను భారతదేశంలో కలుపుతూ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్‌పై సంతకం చేయాలని నెహ్రు మహారాజుకు షరతు విధించారు. అలాగే, భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపొందిస్తున్న కాలం ఇది. కాశ్మీర్‌లో ముస్లిములు ఎక్కువగా నివసిస్తున్నందున, ఈ మహారాజులు భారతదేశంలో చేరే నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించాలని, సమయానికి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నెహ్రు గారు సూచించారు. గత్యంతరం లేని పరిస్థితిలో, మహారాజా 1947 అక్టోబర్ 26న సంతకం చేశారు. ఆ సమయంలో భారతీయ సైన్యం కాశ్మీర్‌లో ప్రవేశించింది. 31 అక్టోబర్ తేదీన షేక్ అబ్దుల్లా నేతృత్వంలో కాశ్మీర్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. అప్పటికే పాకిస్తాన్ సైన్యాన్ని ఆక్రమించిన ప్రాంతాల నుండి కొంతవరకు వెళ్ళగొట్టినప్పటికీ ప్రస్తుతము అజాద్ కాష్మీర్ ప్రాంతములో పాకిస్తాను సేనలు అలానే ఉన్నాయి.
పాకిస్తాన్ చేసిన దురాక్రమణకు బ్రిటిష్ వారి సహాయ సహకారాలు ఉండటంతో, పాకిస్తాన్ సేనలు యుద్ధంలో అజాదీ ముస్లిములు మహారాజా హరిసింగ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాయని చెప్పబడింది. దీనిని త్రిప్పికొట్టడానికి షేక్ అబ్దుల్లా ప్రభుత్వ ఏర్పాటు ఉపయోగపడింది. పాకిస్తాన్ వాదనను నిర్భంధించడానికి నెహ్రు, పాకిస్తాన్ దురాక్రమణం గురించి ఐక్యరాజ్య సమితిలో పిర్యాదు చేశారు. బ్రిటన్ మరియు పాకిస్తాన్ కలిసి ఆడుతున్న నాటకానికి ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు జూలై 1948 నాటికి వచ్చి ఆటకట్టించారు. చివరకు, పాకిస్తాన్ తమ సేనలు అజాదీ తిరుగుబాటులో పాల్గొన్నట్లు ఒప్పుకుంది.
1949 జనవరి 1వ తేదీన పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఐక్యరాజ్య సమితి నిమిత్తం నిమిట్జ్ అనే వ్యక్తిని నియమించింది. ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి ముందు, పాకిస్తానీ సేనలు ఆక్రమించిన భూభాగం నుండి వెళ్ళిపోవాలని ఒక షరతుగా ఉంది. అయితే, ఇప్పటికీ పాకిస్తానీ సేనలు అక్కడే ఉన్నారు. బ్రిటన్ మరియు అమెరికా ఆధ్వర్యంలో కాష్మీర్ పాకిస్తాన్‌కు అప్పగించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టబడ్డాయి.
కానీ, రష్యా ఈ తీర్మానాలను అడ్డుకుంటూ, భారత్ యధాతథ స్థితిని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.
కాష్మీరులో శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి చేసిన ప్రయత్నాలలో నిష్పాక్షికత కొరత కారణంగా కాష్మీరు సమస్య పరిష్కారములేకుండా ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తించాలి. కాష్మీరు మహారాజా భారతదేశ స్వాతంత్య్ర చట్టానికి అనుగుణంగా కాష్మీర్‌ను భారతదేశంలో చేర్చాడు. ఆ చట్టం బ్రిటిష్ వారు రూపొందించారు. అయితే, బ్రిటిష్ వారు దీనిని అనైతికంగా వ్యతిరేకించి భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు. మన ఈశాన్య రాష్ట్రాలలోని వేర్పాటువాద సంస్థలకు కూడా బ్రిటిష్ ఇప్పటికీ ఆశ్రయాన్ని అందిస్తున్నారు. అలాగే, బ్రిటిష్ నైజాముతో ఐక్యరాజ్య సమితిలో భారతదేశం హైదరాబాదును దురాక్రమణ చేసినట్లు ఒక పిటీషన్ వేసింది. ఆ పిటీషన్ 1978లో నైజాము ఉపసంహరించుకున్నాడు.
1951 నుండి ప్రారంభించి, కాష్మీరు ప్రజాప్రతినిధులు వారి రాజ్యాంగాన్ని రచించారు. ఫిబ్రవరి 1954 లో, కాష్మీరు రాజ్యాంగ సభ కాష్మీరు భారతదేశంలో చేరడాన్ని చట్టబద్ధతను కల్పిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విధంగా, కాష్మీరు ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగి ఉంది. కాష్మీరు లో చట్టబద్ధమైన ప్రభుత్వం 1957 నాటికి ఏర్పడింది. కరణ్ సింగ్ సదర్ ఇ అజామ్ గా మరియు భక్షి గులామ్ ప్రధాన మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తరువాత, ఈ ప్రధాన మంత్రి, సదర్ ఇ రియాసత్ బిరుదులను ఇందిరా గాంధీ షేక్ అబ్దుల్లాను ఒప్పించి ముఖ్యమంత్రి మరియు గవర్నర్లుగా మార్చారు.
భారతీయ పౌరసత్వము
1954 లో కాష్మీరీలకు భారతీయ పౌరసత్వము ఇవ్వబడినది. కాని కాష్మీరులో భారతీయులకు పౌరసత్వము ఉండదు. అలాగే భారతీయ సుప్రీం కోర్టు అధిపత్యాన్ని కాష్మీరుకు వ్యాప్తిచెయ్యడమయినది.
బ్రిటిషు వారి చేతిలో గల మద్రాసు, బాంబే, కలకత్తా మొదలయిన ప్రసిడేన్సీ ప్రాంతాలు ఉండేవి.
భారతదేశ ఉపఖండంలోని సంస్థానాలు ఒప్పందం ప్రకారం తమ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని, వారి ప్రతినిధులను ఐక్య ఇండియాకు పంపించాలి. ఈ ప్రక్రియలో కొంతమంది రాజ్యాంగ సభకు ప్రతినిధులను పంపించారు. చివరికి, వారు అందరూ చేతులెత్తి ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదించారు. మొదట మూడు రకాల రాష్ట్రాలు ఉండేవి. అయితే, కాష్మీరు తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోగలిగింది. ఒకవైపు, అమెరికా, బ్రిటన్, చైనా, ఆస్ట్రేలియా పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతూ ఆర్థిక, ఆయుధ సంపత్తిని అందిస్తూ, అంతర్జాతీయంగా ఇండియాను ఒంటరిగా చేయడానికి కాష్మీరు సమస్యను వారి శక్తి మేరకు ఇంతకాలం రగులుస్తూనే ఉన్నారు.
పూర్వ కాలం నుండి బ్రిటన్ కు అనుకూలంగా ఉన్న ఆర్ ఎస్ ఎస్ వారసులైన పార్టీ ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉండటం వలన, వీరి హయాములో కాష్మీర్ ను పాకిస్తాన్ కు అప్పగించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
మనం పాకిస్తాన్ ఆక్రమించిన భాగాన్ని ఆక్రమిత కాష్మీర్ అని పిలుస్తాము. పాకిస్తాన్ దీనిని స్వతంత్ర కాష్మీర్ అని పిలుస్తుంది. బ్రిటన్ మరియు అమెరికా ఈ ప్రాంతాన్ని భారతదేశం ఆధీనంలో ఉన్న కాష్మీర్ అని పిలుస్తున్నాయి. ఈ విధంగా, అమెరికా మరియు బ్రిటన్ సంబోధనను భారతదేశం ఇప్పటివరకు నిరసిస్తూ వచ్చింది.
కానీ ఇటీవల బీజేపీ ప్రభుత్వం అమెరికా అలా సంబోధించడంలో తప్పులేదు అని ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వము కాష్మీర్ రాష్ట్ర పటములో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాన్ని వేరుగా చూపిస్తూ వెడదీసింది. అంటే కాష్మీరు ఇండియాలో చేరడము బ్రిటనులాగానే ఆర్ ఎస్ ఎస్ బీజేపీలు నిరసిస్తున్నాయా?
కాష్మీరు సమస్యను నెహ్రూ సృష్టించాడని మన హిందూత్వా వాదులు తరచుగా చెబుతుంటారు. కానీ, నిజానికి ఈ వాదన బ్రిటిషు వాదనలతో సంబంధం ఉంది. నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శించి కాష్మీర్‌ను చట్టబద్ధంగా భారతదేశంతో కలిపాడు. ఆ చట్టం కూడా బ్రిటిషు వారు రూపొందించినది. వారు రూపొందించిన చట్టంలోని అంశాల ఆధారంగా కాష్మీర్ భారతదేశంలో చేరింది. ఈ విషయాన్ని పక్కన పెట్టి, బ్రిటిషు వారు కాష్మీర్‌ను పాకిస్తాన్‌కు కట్టబెట్టాలని ప్రయత్నించడం వారి కుయుక్తులను, కుతంత్రములను వెల్లడిస్తుంది. బ్రిటిషు వారి అభీష్టానికి వ్యతిరేకంగా నెహ్రూ ప్రవర్తించాడని బ్రిటిషు నెహ్రును నిందించడం సహజమే. అయితే, ఈ బీజేపీ వారు ఈ బ్రిటిషు పథకాన్ని సమర్థించడం ఏ విధంగా సరైనది?
ఈ చరిత్ర కాలంలో ఆర్ ఎస్ ఎస్ మరియు దాని సంస్థలు బ్రిటన్‌కు మద్దతుగా నిలిచాయి. భారతదేశ వాదనను నిరసించారు. కాష్మీరు సమస్యకు నెహ్రు కారణమని బ్రిటన్ వాదిస్తోంది. కాష్మీరు రాజును భారతదేశంలో కలపడానికి ఒప్పించిన నెహ్రు యొక్క రాజకీయ చతురత బ్రిటన్‌కు ఇప్పటికీ కొరుకుపడని అంశంగా ఉంది. అందువల్ల, బ్రిటన్ కాష్మీరు పాకిస్తాన్‌లో కలపాలనే దురుద్దేశాన్ని నెహ్రు నిరోధించాడని, కాబట్టి కాష్మీరు సమస్యకు నెహ్రు కారణమని వాదిస్తున్నారు. అమెరికా బ్రిటన్‌ల అనుకూలత పొందడానికి ఈ వాదనకు ఆర్ ఎస్ ఎస్ వారసులు వంతపాడుతూ అసంబద్ధమైన వాదనలు చేస్తుంటారు.
షేక్ అబ్దుల్లా
షేక్ అబ్దుల్లాను ఇందిరా గాంధీ 1975లో విడుదల చేసి కొన్ని ఒప్పందాలకు అంగీకరించమని కోరింది. ఈ ఒప్పందం ప్రకారం, కాష్మీరు భారతదేశంలో భాగమని అబ్దుల్లా అంగీకరించాడు. ఈ పరిణామంతో ప్రజాభిప్రాయ సేకరణ డిమాండ్ (ప్లెబిసైట్) అంశం అటకెక్కింది. అంటే, షేక్ అబ్దుల్లా 1954లో కాష్మీరు రాజ్యాంగ సభ భారతదేశంలో చేరడాన్ని ఆమోదించిన తీర్మానాన్ని అంగీకరించాడు. అలాగే, 1953 తరువాత, అంటే తాను పదవీచ్యుతుడైనప్పటి నుండి ఇప్పటివరకు కాష్మీరు పార్లమెంట్ చేసిన చట్టాలను రద్దు చేయాలన్న అబ్దుల్లా డిమాండ్‌ను అతను వెనక్కు తీసుకున్నాడు. ఇకపై కాష్మీరు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిగా, సదర్ ఇ రియాసత్‌ను గవర్నర్‌గా సంభోదించడానికి అబ్దుల్లా అంగీకరించాడు. ఇది నిజంగా ఇందిరా గాంధీ యొక్క రాజకీయ చతురతకు ఒక ఉదాహరణ. అలా అంచెలంచలుగా కాష్మీరు మీద భారతదేశం యొక్క రాజ్యాంగపరమైన పట్టును బిగిస్తూ వస్తోంది. అయితే ఇంకనూ కొన్ని అంశములు కాష్మీరు రాజ్యాంగ పరిధిలోనే ఉన్నవి. ఈ షేక్ అబ్దుల్లా పుత్రుడే ఫరూక్ అబ్దుల్లా.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. యువరాజు కరణ్ సింఘ్ యొక్క అధిపత్యాన్ని షేక్ అబ్దుల్లా వ్యతిరేకించాడు. ఈ అధిపత్య పోరాటం 1953 నుండి 1975 వరకు, అంటే రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. అంటే, ఈ కాలంలో భారతదేశంలోని ప్రభుత్వాలకు బ్రిటన్ మరియు అమెరికా కునుకు లేకుండా చేశాయని అర్థం. ఈ సమయంలో ఇందిరా గాంధీ చొరవతో బాంగ్లాదేశ్ స్థాపించబడింది.
ఆర్టీకిల్ 370
భారతదేశ రాజ్యాంగం యొక్క అధికరణం ఆర్టికల్ 370 కాశ్మీరును ఒక రాష్ట్రంగా గుర్తిస్తుంది. అలాగే, కాశ్మీరుకు భారతదేశంతో రాజ్యాంగపరమైన సంబంధాన్ని నిర్వచిస్తుంది. కాశ్మీరులో స్వాతంత్ర్య లక్షణాలను అంచెలంచెలుగా తగ్గించడం జరిగింది. ఈ అధికరణం లేకపోతే, కాశ్మీరు 1947 కు ముందు ఉన్న పరిస్థితిని తిరిగి పొందుతుంది. అంటే, భారతదేశంతో విడిపోతుంది. ఇది హిందుత్వ వాదులకు కావలసినదేనా? అందువల్ల, వారు ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని కోరుకుంటున్నారు.