జాతీయతా భావ లేమి
భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం భారతీయులలో జాతీయతా భావ లేమి వలననే అని నేను భావిస్థున్నాను.గత 15 సంవత్సరాలుగా భారత దేశం సామాజికం గాను , రాజకీయం గాను మరియు సాంస్కృతికంగాను గతి తప్పి అధోగతి పాలవడం మనం గమనిస్తున్నాము.ఏ వ్యక్తి తమ చుట్టు ఏం జరుగుతుందొ గమనించడం లేదు.
సామాజిక దృష్టికోణంలో పరిశీలిస్తే – ప్రజలు నైతిక విలువలు, #సనాతనధర్మం అన్నింటిని పక్కన పెట్టి ధన సంపాదన, వ్యక్తిగత స్వార్ధం, భౌతిక సుఖాలు, ఆస్తి సమపార్జనల వైపు పరుగులు తీయడం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి.
ఈ విపరీత సామాజిక పరిణామం 20 సంవత్సరాల పైబడిన వ్యక్తులలో మరియు 38 సంవత్సరాల లోపు వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్న యువతలో భారతీయ సంస్కృతికి అభిమానం కనబడుతుంది. ప్రభుత్వ చర్యలు కూడా ఈ విపరీత ధోరణులకు సహాయపడుతున్నాయి. ఉదాహరణకు, పాశ్చాత్య క్రైస్తవ సామాజిక పద్ధతిని క్రమబద్ధీకరించి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతోంది.
రాజకీయంగా, శ్రీమతి ఇందిరా గాంధి తరువాత దేశంలో జాతీయత భావం అడుగంటింది. శ్రీ పి.వి.నరసింహరావు గారి 5 సంవత్సరాల పాలనలో జాతీయత భావం కొంత మిణుకు మిణుకు మంటూ ఉండేది. తరువాత పూర్తిగా అడుగంటింది.
జవహర్ లాల్ నెహ్రు గారు వ్యవసాయ అభివృద్ధికి, ఆహార ధాన్యాల స్వయం సమృద్ధికి ఉపయోగపడే ఆనకట్టలు నిర్మించడమే కాకుండా, ఇనుము ఇతర లోహాలను తయారు చేసే భారీ పరిశ్రమలను స్థాపించారు.
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
ఇందిరా గాంధి రక్షణ పరికరాలు మరియు ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి కోసం వివిధ పరిశోధనా సంస్థలు మరియు పరిశ్రమలు స్థాపించబడ్డాయి. భారతదేశ అభివృద్ధి అక్కడితో ముగిసింది.
ప్రస్తుతం, భారతీయులు ఉపయోగించే ఏ వస్తువైనా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గృహాల్లో ఉపయోగించే వంట నూనె కూడా గత 2 దశాబ్దాలుగా మనం దిగుమతి చేసుకుంటున్నాము.
పాశ్చాత్య క్రైస్తవ సామాజిక వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణంగా భారతీయులు నమ్ముతున్న విధంగా ప్రభుత్వ చర్యలు జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా – భారతీయుల కుటుంబ వ్యవస్థను క్రమబద్ధంగా దెబ్బతీయడానికి చట్టాలు రూపొందించడం.
దిగుమతయ్యే కంప్యూటర్లు, విమానాలు, రక్షణ పరికరాలు, భారి యంత్రాలు వంటి వాటిని పక్కన పెట్టినప్పుడు, భారతీయులు తమకు అవసరమైన కార్లు, మోటారు సైకిళ్లు, సైకిళ్లు, ఏ కంపెనీ నుండి, ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారో అనే విషయాలపై పోటీ పడుతూ ఉన్నారు. అవి దిగుమతి అవుతున్న వస్తువులని గుర్తించడంలో ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.
ఒకప్పుడు భారతీయులు తయారు చేసిన వస్తువుల ప్రాముఖ్యతను ఎవ్వరూ గుర్తు చేసుకోడం లేదు. ప్రపంచ ప్రఖ్యాత పురాతన సాంస్కృతిక సంపదతో కూడిన సింధూ లోయలో 5000 సంవత్సరాల క్రితం, ప్రపంచంలోనే మొదటిసారిగా దూది పండించి వస్త్రాలను తయారు చేసి ఎగుమతి చేశారు.
2000 సంవత్సరాల క్రితం, ప్లైనీ అనే వ్యక్తి రోమన్లు భారతదేశం నుండి వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్ల రోమన్ దేశం నుండి నిరంతరం బంగారం భారతదేశానికి తరలిపోతున్నట్లు వాపోయాడు.