అఖిలాంధ్ర
ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ రాష్ట అవతరణము నకు అసలు పునాది 1911 లోనే పడి చివరికి 1956 కు పూర్తీ అయినది. తెలుగు ప్రముఖులు జొన్నవిత్తుల గురునాధం, ఉన్నవ లక్ష్మినారాయణ గార్లు 1911 లోనే దక్షిణ భారత దేశంలోని తెలుగు వారు నివసించే ప్రాంతాలన్ని కలిపి ఒక రాజకీయ “అఖిలాంధ్ర” రాష్ట్ర పటాన్ని తయారు చేశారు. (Formation of Andhra Pradesh)
ఆంధ్రుల ఆలోచనా విధానం మరియు పోరాట పటిమ అనన్యమైనవి. అందువల్ల, ఆంధ్రులు చరిత్రలో అనేక సందర్భాల్లో తమ స్వీయ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో ఉన్న దేశభక్తి ప్రశంసనీయమైనది. స్వరాష్ట్ర ఆకాంక్ష స్వాతంత్ర్య పోరాటానికి అడ్డుగా భావించబడినప్పుడు, ఆంధ్ర రాష్ట్ర వాదాన్ని కొంతకాలం పక్కన పెట్టి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రము
బెంగాలీ విభజన నిలుపుదల (1911) భారతదేశంలో శాంతియుత ఉద్యమాల విజయానికి పునాది వేసిందని చెప్పవచ్చు.
వందే మాతరం ఉద్యమం విజయవంతమై, భారత ప్రభుత్వం (అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న) బెంగాలీ విభజనను రద్దు చేయడం ఆంధ్రులకు ప్రేరణగా మారింది. ఆంధ్రులకు ఒక స్వంత రాష్ట్రం అవసరమని 1911లోనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ముందు ఆంధ్రులు నిర్వహించిన శాంతియుత పోరాటాల వివరాలను క్రింద చూపిన విధంగా వరుసగా వివరించబడింది.
1912, మే నెలలో తీరాంధ్రం లోని కృష్ణ, గోదావరి జిల్లాల తెలుగు ప్రముఖుల సమావేశం కాకినాడలో జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక తీర్మానం ప్రవేశ పెట్టబడింది, అయితే ఈ ప్రత్యేక ఆంధ్ర సమస్య ఒక జిల్లా సమస్య కాదని, ఇది అన్ని జిల్లాల ప్రజలు కలిసి నిర్ణయించాల్సిన అంశమని సభ్యులు ఆ తీర్మానాన్ని తిరస్కరించారు.
ఆంధ్ర మహాసభ
మళ్లీ 1913 మే నెలలో బాపట్లలో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వేరుపడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ప్రతిపాదనపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. ఈ సమస్యపై పరిశీలన చేయడానికి ప్రతిపాదనలు అందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
1914, ఏప్రిల్ 11న విజయవాడలో రెండవ సభ జరిగింది. కందుకూరి వీరేశలింగం, తిరుపతి వేoకట కవులు, పురాణ పండ వెంకట సుబ్బయ్య, న్యాపతి సుబ్బారావులు ఈ సభకు హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు సంబంధించిన తీర్మానం ఇక్కడ గెలిచింది.
పట్టాభి సీతారామయ్య, కోపెల్ల హనుమంతరావు
1911 – 1914 మధ్య కాలంలో వెంకటప్పయ్య గారు ‘ఆంధ్రోద్యమం’ అనే కావ్యం రచించారు.
పట్టాభి సీతారామయ్య గారు మరియు కోపెల్ల హనుమంతరావు గారు కలిసి ‘ఆంధ్ర రాష్ట్రం’ను రచించారు.
తెలుగు ప్రముఖులు జొన్నవిత్తుల గురునాధం మరియు ఉన్నవ లక్ష్మినారాయణ 1911 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలను కలిపి ఒక అఖిలాంధ్ర రాష్ట్ర పటాన్ని రూపొందించారు.
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
ఆంధ్ర పత్రిక
1914 నాటికి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ‘ఆంధ్ర పత్రిక’ బొంబాయినుండి మద్రాసుకు తరలించబడింది.
స్వరాజ్య ప్రత్రిక
1921 లో ప్రకాశం పంతులు గారు ప్రారంభించిన ‘స్వరాజ్య ప్రత్రిక’ (Swarajya Patrika) అనే ఇంగ్లీషు పత్రిక కూడా అంధ్రోద్యమానికి అపారమైన సేవ అందించింది.
మూడవ ఆంధ్ర మహాసభ
మూడవ ఆంధ్ర మహాసభ 1915 మే నెలలో విశాఖ పట్టణంలో జరిగింది. పానుగంటి రాజా మరియు వెంకటపతిరాజుల ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించబడింది. ఇక్కడ మద్రాసు రాష్ట్రంలోని 11 తెలుగు జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాల్గవ సభ 1916 మే నెలలో కాకినాడలో మట్నూరి కృష్ణారావు గారి అధ్యక్షతన జరిగింది. తరువాత, 1917లో దేశాన్ని భాషా ఆధారిత రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని ఆమోదించారు.
ఐదవ సభ 1917 జూన్ 1వ తేదీన నెల్లూరులో జరిగింది. హాజరైన వారిలో రాయలసీమ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. గుత్తి, అనంతపురం జిల్లాలకు చెందిన పిళ్ళే, నంధ్యాల, కర్నూలుకు చెందిన ఏకాంబర్ అయ్యర్ లు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించారు, అయితే కర్నూలు వాసులు సభాధ్యక్షులు హరి సర్వోత్తమరావు గారి తెలివితేటలతో జిల్లావారీ ఓటింగ్ పద్ధతిని (అంటే జిల్లాకు ఒక ఓటు) ప్రవేశపెట్టి తీర్మానాన్ని గెలిపించారు.
1917 డిసెంబర్ లో న్యాపతి సుబ్బారావు నేతృత్వంలో తెలుగు ప్రజలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా దేశాన్ని పునర్నిర్మించాలనే ఉద్దేశంతో మాంటెగ్ చెంస్ ఫర్డు రాంజ్యాంగ సంస్కరణల కమిటికి విజ్ఞప్తి చేశారు.
1918, ఫిబ్రవరి లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బి ఎన్ శర్మ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, అక్కడ జిన్నా, శ్రీనివాస శాస్త్రి వంటి వారు వ్యతిరేకించడంతో ఆ తీర్మానం విఫలమైంది.
1917 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ప్రత్యేక అంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు అంగీకరించారు. బాల గంగాధర తిలక్ భాషాప్రయుక్త రాష్ట్రాల వాదనను మద్దతు ఇచ్చారు. తదుపరి సంవత్సరంలోనే 1918 లో ప్రత్యేక అంధ్ర కాంగ్రెస్ కమిటి ఏర్పడినది.
1920లో నాగపూర్‌లో సేలం విజయ రాఘవాచారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపే తీర్మానం చేయబడింది.
ఈ కాలంలో బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అయిన జస్టీస్ పార్టీ హోమ్ రూల్ ఉద్యమాన్ని మరియు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాదాన్ని వ్యతిరేకించింది.
పిల్లలమర్రి అంజనేయులు
1927 మార్చి 14న మద్రాసు శాసన సభలో పిల్లలమర్రి అంజనేయులు ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మద్రాసు ప్రభుత్వం ఆమోదించి భారత ప్రభుత్వానికి పంపించింది. అయితే, ఇది ఉపయోగంలేకపోయింది..
సైమను కమీషన్ వచ్చినప్పుడు కేంద్ర కాంగ్రెస్స్ కమిటీ అభిప్రాయానికి విలువనిచ్చి మద్రాసులోని అంధ్రులు ‘గొబ్యాక్ సైమన్’ అంటూ సైమను రాకను నిరసించారు.
(అయితే, సైమను కు స్వరాష్ట్రం కావాలని ఒరిస్సా, సింధు ప్రజలు మహాజరు ఇచ్చి సొంత రాష్ట్రాలు ఏర్పరచుకున్నారు).
1928 లో మోతిలాల్ నెహ్రు నేతృత్వంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆయన అందించిన నివేదికలో (నెహ్రు రిపోర్ట్) భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
1932 లో బొబ్బిలి రాజా, మోచర్ల రామచంద్రరావు, ఎపి పాత్రో, వి వి గిరి, వి వి జోగయ్య వంటి వ్యక్తులు లండన్ వెళ్లి సెక్రటరి ఆఫ్ స్టేట్ ను కలుసుకుని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి అభ్యర్థించారు. మరలా 1935 జూన్ 27 న దేదీన నరసింహరావు, సుబ్బరావు, సాంబ ముర్తి తదితరులు ఇంగ్లాండు వెళ్లి మహాజరులకు సమర్పించారు.
అప్పటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాదానికి రాయలసీమ ప్రజల అభ్యంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. 1927 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించబడిన తరువాత ఈ విభేదాలు మరింత పెరిగాయి.
1937 లో జరిగిన ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి గా నియమితులయ్యారు. ఆంధ్రా నుండి బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం మరియు వి వి గిరి మంత్రులుగా చేరారు.
శ్రీ బాగ్ ఒప్పందం 16.11.1932 న రాయలసీమ ఆంధ్రులకు మరియు కోస్తా జిల్లాల ఆంధ్రులకు మధ్య జరిగింది. నదీ జలాల వాటాలు, రాజధాని, హై కోర్టు ఏర్పాటు చేయాల్సిన స్థలం గురించి ఈ ఒప్పందంలో వివరాలు అందించబడ్డాయి.
భాషాప్రాతిపదికన
21.4.1938 తేదీన భాషాప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని విభజించాలనే తీర్మానాన్ని మద్రాసు అసెంబ్లీ ఆమోదించి భారత ప్రభుత్వానికి పంపించింది. 1939 మార్చిలో ఈ తీర్మానం తిరస్కరించబడింది.
1946లో టంగుటురి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.
1947 ఆగష్టు 14న జవహర్లాల్ నెహ్రు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం నూతన రాజ్యాంగంలో చేర్చబడుతుందని ప్రకటించారు.
ఆగష్టు 15, 1947 నాటికి భారతీయులు బ్రిటిషు పాలనను దేశం నుండి తొలగించగలిగారు. వారు తమ దేశ రాజకీయ భవిష్యత్తును స్వతంత్రంగా నిర్ణయించుకున్నారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో తీరాంధ్ర జిల్లాలు అయిన సర్కారు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మరియు రాయలసీమలోని ఆంధ్రులు విస్తృతంగా పాల్గొన్నారు.
దేశాన్ని ఐక్యంగా మార్చే ప్రక్రియలో నెహ్రు గారు మునిగి తేలుతున్న సమయంలో ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర వాదం ఆయనకు విపరీతమైన ధోరణిగా అనిపించవచ్చు. ఆయనకు తమిళుల వేర్పాటువాదాన్ని నివారించడం ప్రధాన సమస్యగా భావించబడవచ్చు. అప్పట్లో మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాజ్యం, మళయాళ, కన్నడ భాషల వారి కొన్ని ప్రాంతాలు కలిసివుండేవి. ఆ రోజుల్లో హిందీ ప్రాంతం వారంటే తమిళులకు ఏవగింపు ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మైసూరు, కొచ్చి, కాళికట్ రాజ్యాలు (సంస్థానాలు) కూడా కలిపి దక్షిణ దేశంగా ఏర్పరచాలని ఒకసారి రాజాజి చెప్పారు.
అలాంటి సందర్భంలో తమిళుల ఆధీనంలో ఉన్న కోస్తా మరియు రాయలసీమ జిల్లాలను మద్రాసు నుండి విడదీస్తే, హిందుస్తానీయులపై తమిళుల వ్యతిరేకత పెరిగి, దేశ ఐక్యతకు ప్రమాదం కలిగించవచ్చని నెహ్రు గారు ఆందోళన చెందవచ్చు.
ఇలాంటి ఆలోచనలతో నెహ్రు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించవచ్చు.
అంతకుముందు, నెహ్రు గారు ఆంధ్రుల స్వరాష్ట్ర కోరికను ఆంధ్ర సామ్రాజ్య వాదంగా అభివర్ణించారు.
తమిళులు ఆంధ్ర వారి కొత్త రాష్ట్రానికి రాజధాని కోసం అవసరమైన నిధులు అందించకుండా, మద్రాసు వారు హైదరాబాదు ను తెలుగు వారి రాజధానిగా ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రాన్ని ఏర్పరచవచ్చు.
తెలుగు ప్రజలు ఈ విధంగా కలిసి ఒక పెద్ద రాజ్యంగా మారి, ఏకతాటిపై ఉండి హిందుస్థానీయులు, అంటే ఉత్తర భారతీయులకు అధికార పోటీలో రాకుండా ఉండేందుకు ఫజల్ అలి కమీషన్ ద్వారా రెండు తెలుగు ప్రాంతాలలో విభేదాలను రగిలించే విధంగా కమీషన్ రిపోర్టు రూపొందించబడినట్లు ఉండవచ్చు.
నిజానికి, నెహ్రు గారు రాజ్యాంగ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ను ఏర్పాటు చేసి, పెద్దమనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రాను విభజించినట్లుగా ఉంది. రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కులకు వ్యతిరేకంగా షరతులు పెద్దమనుషుల ఒప్పందంలో చేర్చబడ్డాయి. ఈ షరతులు రెండు ప్రాంతాల ప్రజలను ఎప్పటికీ కలవకుండా చేసి, ప్రస్తుతం రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చడానికి ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం, సుమారు 60 సంవత్సరాల సమ్మేళనానికి తరువాత, పూర్వపు కారణాలను చూపిస్తూ రాష్ట్రాన్ని విడగొట్టడం న్యూ ఢిల్లీ చారిత్రక దోషంగా భావిస్తున్నాను.
Nehru’s Comments on Visalandhra
In Indian Express 17th October 1953, Nehru was quoted to have said: “there is an underlined expansionistic and imperialistic design in the argument of Visalandhra slogan of Andhras”.
1948 జూన్‌లో భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ధార్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. అయితే, ధార్ కమిటీ భాషా ప్రాయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా నివేదికను సమర్పించింది.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )
స్వామి సీతారామ్
గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారమ్ 1951 ఆగష్టులో ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టారు. 35 రోజుల తర్వాత, ఆచార్య వినోభాభావే సెప్టెంబర్ 20న దీక్షను విరమింపచేశారు.
నిరాహార దీక్షలు నిర్వహించడం రాజ్యాంగేతర పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని లొంగదీయడం అని నెహ్రు వ్యాఖ్యానించారు.
తరువాత, జవహర్లాల్ నెహ్రు, పటేల్, సీతారమయ్యల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మద్రాసు పట్టణం సంబంధించి రాయలసీమ వాసులకు ఉన్న మమకారాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్ర వాదనను నీరుగార్చింది.
పొట్టి శ్రీ రాములు
ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు వాసి అయిన శ్రీ పొట్టి శ్రీ రాములు గారు 1952 అక్టోబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. నెహ్రూ గారు మరియు రాజగోపాలాచారి గారు శ్రీ రాములు గారి నిరాహార దీక్షను తేలికగా తీసుకున్నారు. దీక్ష 52 రోజులు పూర్తయిన తరువాత శ్రీ పొట్టి శ్రీ రాములు గారి ప్రాణాలు అనంతవాయువులలో కలసిపోయాయి.
చివరకు త్యాగ ధనుడు అమర జీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగంతో ఆంధ్రుల చిరకాల వాంఛ కొంత సాకారమైంది. 1953 అక్టోబర్ 1న తెలుగు వారి ప్రాంతాలు మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే, క్రొత్తగా ఏర్పాటు అయిన ఆంధ్ర రాష్ట్రంతో నైజాం లోని ఆంధ్రుల ఐక్యత జరగవలసి ఉంది.
భారతదేశంలో భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఒక ప్రాధమిక దశగా నిలిచింది.
శ్రీ ఫొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగం దేశాన్ని కదిలించింది. ఈ ఉద్యమం తీవ్రంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెన్నేటి విస్వనాథం, దంతులూరి నారాయణరాజు, సి వి సోమయాజులు వంటి వారు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
చివరగా, నెహ్రు 1952 డిసెంబర్ 19న మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు.
1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అసలు టంగుటూరి ముఖ్యమంత్రి కావాల్సి ఉన్నా, తమిళులను సంతృప్తి పరచడానికి నెహ్రు రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించారు. రాజాజి మద్రాసుకు నీటి సరఫరా కోసం కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును ప్రారంభించగా, తెలుగువారు ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించారు.
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
తాత్కాలిక రాజధానిగా కర్నూలును ఎంపిక చేశారు. ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కర్నూలును రాజధానిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకించిన వారికి ప్రకాశం గారు త్వరలో ఆంధ్రులకు నిజమైన రాజధాని ఏర్పడుతుందని హామీ ఇచ్చారు. అంటే, 1953 నాటికి హైదరాబాదు ను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఢిల్లీలో ఉందని స్పష్టమవుతుంది.
ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించబడింది. గుంటూరులో హైకోర్టు స్థాపించారు.
మద్రాసు నుండి కోస్తాంధ్రులు, సీమాంధ్రులు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడినప్పటికీ, భారతదేశంలో ఆంధ్రులు ఇంకా సాధించాల్సిన విషయాలు పూర్తిగా సాధించలేదు. తెలంగాణా అని పిలువబడే నైజాంలోని ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాలు, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం తో కలిపి విశాలాంధ్ర నిర్మాణం జరగాలి.
నైజాం ఆంధ్రులు
తీరాంధ్ర ప్రజలు నిజాం సంస్థానాన్ని వాడుకలో నైజాం అని పిలుస్తారు. మొఘలుల కాలంలో 1724 లో నిజాం ఉల్ ముల్క్ అనే వ్యక్తి, డిల్లీ లోని రాజకీయ అనిశ్చిత స్థితి నుండి తప్పించుకోవడానికి డెక్కను సుబహ కు సుబేదారు గా అనుమతి తీసుకొని ఔరంగాబాదు రాజధానిగా రాజ్యం స్థాపించాడు.
తరువాత కొంత కాలం తర్వాత హైదరాబాదుకు తన రాజధానిని మార్చాడు. ఈయన వారసులకి ఈ విధంగా వచ్చిన రాజ్యమే ప్రస్తుతం మనం చర్చిస్తున్న నైజాం.
అప్పట్లో నిజాం పరిపాలనలో నాలుగు ప్రధాన సుభాలు ఉండేవి. ఒకటి వరంగల్లు, రెండు మెదక్, మూడు ఔరంగాబాదు, నాలుగు గుల్బర్గా.
(అంచెలంచెలుగా నిజాం తీరాంధ్ర ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి అమ్ముకోవడం వల్ల ఆంధ్రులు కొంతమంది బ్రిటిషు వారి మద్రాసు ప్రెసిడెన్సీలోను కొంతమంది నైజాం లోను సుమారు ఒక వంద సంవత్సరాలు విడివిడిగా ఉన్నారు).
తెలుగు మాట్లాడే వ్యక్తులు నైజాం కాలంలో అధికంగా ఉన్నప్పటికీ, రాజధానిలో మరాఠీలు, కన్నడిగులు, హిందుస్థానీలు, బెంగాలీలు వంటి ఇతరుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది.
ఆ కాలంలో జిల్లాల్లో సర్దారులు, జాగీర్దారులు, మొఘసదార్లు, ఫత్తేదారులు వంటి భూస్వాములు నిజాంకు అనుయాయులుగా ఉన్నారు.
నిజాం పరిపాలనలో ఉన్న తెలుగు ప్రాంతాలను తెలంగాణా అని పిలుస్తారు. అయితే, ఈ వ్యక్తులు తమను తాము ఆంధ్రులు అని పిలుస్తారు.
నైజాంలో ప్రభుత్వం విదేశీ పాలనలో ఉంది. అక్కడి అధికారిక భాష ఉర్దు. ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారు తప్పనిసరిగా ఉర్దు నేర్చుకోవాలి. తెలుగు మాతృభాష అయినప్పటికీ, చదువు పొందిన వారు కూడా తెలుగులో చదవడం మరియు వ్రాయడం తెలియకపోవడం జరిగింది. అందువల్ల, తెలంగాణాలోని సామాజిక స్పృహ కలిగిన చైతన్యం ఉన్న తెలుగు ప్రజలలో ప్రముఖులు మొదటగా చేపట్టిన పని ప్రజలకు తెలుగు నేర్పించడం.
కొమర్రాజు లక్ష్మణరావు
శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు 1901 లో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించారు.
ఈ కార్యక్రమానికి మునగాల జమిందారు నాయని వెంకటరంగారావు మరియు హైదరాబాదు మన్సబ్ దారు రావిచెట్టు రంగారవులు సహాయంగా ఉన్నారు.
శ్రీ లక్ష్మణరావు గారు 1906 లో విజ్ఞాన చంద్రిక మండలిని స్థాపించారు.
1921 లో నైజాంలో హైదరాబాదు లో జరిగిన ఒక సంఘటన తెలుగువారి భాషాభిమానాన్ని మేలుకొల్పింది.
1921 నవంబరు 11 – 12 తేదీలలో జరిగిన నిజాం రాష్ట్ర సాంఘిక సంస్కరణల సమావేశంలో అల్లంపల్లి వెంకట రామారావు తెలుగులో మాట్లాడి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు, అయితే సభలో భాషా విషయంలో అభ్యంతరాలు ఎదుర్కోవలసి వచ్చింది.
అప్పుడు అక్కడ ఉన్న తెలుగు వారందరూ ఈ సంఘటనను తెలుగువారికి అవమానంగా భావించి ఆ రాత్రే ‘ఆంధ్ర జన సంఘం’ ను స్థాపించారు.
వీరిలో ప్రముఖులు మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులు ఉన్నారు.
1922 ఫిబ్రవరి 14 న కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్ర జన సంఘం పేరును నైజాం సంస్థాన ఆంధ్ర జన సంఘంగా మార్చారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. నిజాం ప్రభుత్వం తెలుగు ప్రాంతాన్ని తెలంగాణ అని పిలిచేవారు. అయితే ప్రజలు తమను తాము ఆంధ్రులు అని మాత్రమే పిలుస్తారు.
నిజాం ఆంధ్ర సభ
జోగిపేటలో జరిగిన సభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సభలో ఆంధ్ర జన సంఘం పేరును నిజాం ఆంధ్ర సభగా మార్చడం జరిగింది.
తెలుగు ప్రజలలో ఉత్పన్నమవుతున్న ఈ చైతన్యాన్ని నిజాం ప్రభుత్వం సహించలేదు. సభలకు ఆంక్షలు విధించారు. అందువల్ల, నైజాం ఆంధ్రులు తమ తరువాతి సభలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహించడానికి నిర్ణయించారు.
అలాగే, తెలంగాణా అని పిలువబడుతున్న నైజాం ప్రాంతంలోని ఆంధ్రులు నిజామును గద్దె దించడానికి మొదట నిరాయుధ పోరాటం, తరువాత సాయుధ పోరాటం జరిపి, చివరకు 1948 నాటికి విజయవంతమయ్యారు.
నైజాం ప్రాంతంలో ఆంధ్రులు నైజాంను, అతని సైన్యాన్ని, రజాకార్లను, దొరలను ఎదుర్కొని పోరాడారు. దీన్ని తెలంగాణా సాయుధ పోరాటం అని పిలుస్తారు. ఇందులో కమ్యూనిస్టులు మరియు ప్రజలు కలిసి పోరాటం చేశారు. చివరికి భారతదేశం తీసుకున్న పోలీసు చర్యలతో నిజాం పాలన సెప్టెంబర్ 17, 1948 నాటికి ముగిసింది.
1952 ఎన్నికల్లో తెలంగాణాలో కమ్యూనిస్టులు మొత్తం 105 స్థానాలకు 42 స్థానాలు గెలుచుకున్నారు. అలాగే మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు అయిన గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టులు అధిక సీట్లు సాధించారు.
కమ్యునిష్టుల ప్రభావాన్ని గమనించిన కాంగ్రెస్ వారు విశాలాంధ్ర కోరిక ప్రజలలో ఉందని అర్థం చేసుకుని, అప్పటి నుండి విశాలాంధ్రను బలపరచడం ప్రారంభించారు.
1911లో కొండా వెంకటప్పయ్య గారు భారతదేశంలో ఉన్న అన్ని తెలుగు మాట్లాడే భాషా ప్రజల భౌగోళిక ప్రాంతాలను కలుపుతూ ‘అఖిలాంధ్ర దేశం’ అనే చిత్రాన్ని రూపొందించారు అని మేము ముందుగా పేర్కొన్నాము.
అయితే, కొన్ని ప్రాంతాలు నైజాం ఆధీనంలో ఉన్నాయని అఖిలాంధ్ర కలను వెంటనే సాధించడం కష్టమని అప్పట్లో అర్థం చేసుకుని, నైజాం లోని ఆంధ్ర ప్రాంతాలను పక్కన పెట్టి, మద్రాసులోని తెలుగు ప్రాంతాల గురించి మాత్రమే మొదటి పోరాటాన్ని రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా నిర్వహించారు.
‘విశాలాంధ్ర’
1945 లో అన్ని తెలుగుప్రాంతాలను ఒకే రాష్ట్రంగా కలిపే ఆలోచన మళ్లీ పునరుద్ధరించబడింది. దీనిని ‘విశాలాంధ్ర’ అని పిలుస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే శీర్షికతో ఒక పుస్తకం రచించారు. 1949 లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలో విశాలాంధ్ర మహాసభను నిర్వహించారు. 1950 లో వరంగల్లు లో విశాలాంధ్ర సభ జరిగింది. ఈ సభకు ప్రకాశం గారు, కోదాట రామలింగం, హయగ్రీవాచారి, సత్యమూర్తి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
1950 లో నిజామాబాదు లో జరిగిన హైదరాబాదు స్టేటు కాంగ్రెస్ మహాసభలో ‘హైదరాబాదు రాష్ట్రాన్ని భాషాప్రాతిపదికన మూడు భాగాలుగా విభజించి, ఆయా ప్రాంతాలను పరిసర భాషారాష్ట్రాలలో కలిపివేయాలని’ కోరుతూ తీర్మానించారు.
1951లో బెంగళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలో శ్రీ కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర గురించి మాట్లాడినప్పుడు, నెహ్రు ‘అనవసర విషయాలు’ ప్రస్తావించవద్దని హెచ్చరించారు.
అలాగే, 1953 అక్టోబర్‌లో నెహ్రు గారు విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆర్థిక సామ్రాజ్యవాదం అని విమర్శించారు.
Nehru’s Comments on Visalandhra
In Indian Express 17th October 1953, Nehru was quoted to have said: “there is an underlined expansionistic and imperialistic design in the argument of Visalandhra slogan of Andhras”.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట అవతరణము
భాషాప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు 1956 నుండి మాత్రమే ప్రారంభమైంది. అంతకుముందు హైదరాబాదు రాష్ట్రంలో తెలుగుప్రాంతాలతో పాటు మరాఠీ, కన్నడ ప్రాంతాలు కూడా ఉన్నాయి.
కొండా వెంకటరెడ్డి మొదట విశాలాంధ్రకు మద్దతు ఇచ్చి, తరువాత 1954లో తాను హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
భూర్గుల రామకృష్ణారావు
భూర్గుల రామకృష్ణారావు గారు మొదటగా ఆంధ్ర మరియు హైదరాబాదు రాష్ట్రాలు కలవనక్కరలేదని, చివరికి విశాలాంధ్ర కోసం ముఖ్యమంత్రి పదవిని వదిలేశారు.
ఆంధ్ర మరియు హైదరాబాదు లను కలపవద్దని చెప్పిన వారిలో కోస్తా ఆంధ్ర ప్రముఖులు – ఆచార్య రంగా, ఆవుల గొపాలకృష్ణమూర్తి, నడింపల్లి నరసింహరావు, దురువూరి వీరయ్య ఉన్నారు.
ఫజల్ ఆలి కమిషన్
1954లో రాష్ట్రాల పునర్విభజన కమీషన్ ఫజల్ ఆలి అధ్యక్షతన హైదరాబాదుకు వచ్చింది.
శ్రీ ఫజల్ కమిషన్ నివేదిక ఆంధ్రులకు మేలు కన్న కీడు ఎక్కువ చేసింది. శ్రీ కృష్ణ కమిషన్ లాగే, ఫజల్ ఆలి కప్పదాటు సిఫార్సులు చేసి హైదరాబాదు రాష్ట్ర ఆంధ్రులకు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మధ్య విభేదాలను సృష్టించారు.
హైదరాబాదు నుండి కన్నడ, మరాఠా ప్రాంతాలను విడగొట్టి మైసూరు, బొంబాయిలో కలిపారు.
ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పాటు చేయబడింది.
ఫజల్ రాసిన పత్రాలు ఇప్పటికీ రెండు ప్రాంతాల మధ్య విభేదాలకు కారణమై, రాష్ట్రాన్ని విభజించడానికి దారితీస్తున్నాయి.
తమిళులు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కోసం అవసరమైన నిధులను అందించకుండా మద్రాసు వారు హైదరాబాదును తెలుగు వారి రాజధానిగా మార్చి, నెహ్రు గారు 1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్థాపించినట్లు ఉండవచ్చు.
తెలుగు ప్రజలు ఈ విధంగా కలిసి ఒక పెద్ద రాష్ట్రంగా మారి, హిందుస్తానీయులు అంటే ఉత్తర భారతీయులకు అధికారంలో పోటీకి రాకుండా ఉండేందుకు ఫజల్ అలి కమిషన్ ద్వారా చిచ్చు పెట్టినట్లు ఉండవచ్చు.
ఫజల్ అలి రచనల ఫలితమే ప్రముఖుల ఒప్పందం.
నెహ్రు గారు రాజ్యాంగ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాదు రాష్ట్రాన్ని కలిపి ఆంధ్ర ప్రదేశ్‌ను ఏర్పరచారు, ఇది పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రాను విభజించినట్లుగా భావించబడింది. ఎందుకంటే, పెద్దమనుషుల ఒప్పందంలో ఉన్న అన్ని షరతులు రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి.
ఇప్పుడు, అంటే సుమారు 60 సంవత్సరాల కలయిక తరువాత, పూర్వపు కారణాలను చూపించి రాష్ట్రాన్ని విడదీయడం న్యూ ఢిల్లీ చారిత్రక తప్పు చేస్తుందని నేను భావిస్తున్నాను.
అలా, ఫజల్ ఆలి పెట్టిన చిచ్చు 60 సంవత్సరాలు కలసి ఉండి కూడా తెలుగు ప్రజలు కలవకుండా చేసి, ఆంధ్ర ప్రదేశం ఇప్పటికీ రగులు తూనే ఉంది.