అణు పరీక్షలు
అణు పరీక్షలు అణు ఒప్పందం: 1998 లో ఇండియా అణు పరీక్షలు జరిపిన దరిమిలా అమెరికా ఇండియా పై అణు ఒప్పందాన్ని రుద్దినది అని నా అభిప్రాయం. తొలుత అణుపరీక్షలు జరిపినపుడు కలిగిన సంతోషము అణు ఒప్పందము తరువాత తొలగి పోయింది. Nuclear tests in 1998
ఇండియా అణు పరీక్షలు నిర్వహించడం భారతీయుల నైతిక హక్కు. అణు పరీక్షలు అణు బాంబుల తయారికి మాత్రమే కాకుండా, అణు విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చైనా దేశం భారతీయుల చర్యను ప్రశంసించడం విశేషం. అమెరికా గూడచార ఉపగ్రహాల కంట పడకుండా అణుబాంబు సామాగ్రిని ఫోక్రాను చేరవేయడం ఒక విధంగా ఆసియా దేశాలకు విజయంగా చైనా అభివర్ణించింది. ఈ సందర్భంలో ఒక అమెరికన్ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించినది: “భారత దేశీయులు పెంటియమ్ చిప్స్ తయారు చేసిన మేధావులు సుమా!”
అమెరికా ఈ అణు పరీక్షల విషయంలో భారతదేశాన్ని అంతర్జాతీయ విపణిలో ఒంటరిగా ఉంచుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, భారతదేశాన్ని ఒంటరిగా ఉంచితే, అమెరికా నుండి భారతదేశానికి జరిగే వస్తువుల ఎగుమతి నిలిచిపోతుంది, తద్వారా అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది. అందువల్ల, భారత్ ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు.
ఇండియా ప్రస్తుతం అణు బాంబులు కలిగి ఉండటం భారతదేశానికి మరింత రక్షణను అందిస్తున్నట్లు భావించాలి.
అమెరికా ఈ అణు పరీక్షల విషయంలో భారతదేశాన్ని అంతర్జాతీయ విపణిలో ఒంటరిగా ఉంచుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, భారతదేశాన్ని ఒంటరిగా ఉంచితే, అమెరికాలో వస్తువుల ఎగుమతి ఆగిపోతుంది మరియు నిరుద్యోగం పెరుగుతుంది. అందువల్ల, ఇండియా ఈ విషయంపై భయపడాల్సిన అవసరం లేదు.
ఇండియా ప్రస్తుతం అణు బాంబులు కలిగి ఉండటం దేశానికి మరింత రక్షణను అందిస్తున్నట్లు భావించాలి.
(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము. )
అణు ఒప్పందం
అణు ఒప్పందం: అమెరికా దేశ ఆదేశాలను అనుసరించే విదేశాంగ విధానం కేంద్ర ప్రభుత్వం పాటించడానికి ఉర్రూతలూగుతున్నట్లు తెలుస్తోంది. (ఈ సమాచారం ముఖ్యమైన తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికలకు, తెలుగు, ఇంగ్లీషు, హింది టి.వి చానళ్లకు 21.09.07 తేదీన పంపించబడింది.) ఈ విధానం దేశానికి ఏ దుస్థితి ఏర్పడుతుందో హెన్రి కిస్సింజర్ అనే పూర్వ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో చూద్దాం, ఆయన చెప్పినది ఏమిటంటే “అమెరికా దేశం ఏ దేశంతో స్నేహం చేస్తుందో, ఆ దేశాన్ని అమెరికా సైనికంగా ఆక్రమిస్తుంది”. ఈయన చెప్పిన మాటలు ఎల్లప్పుడూ అన్ని దేశాల విషయంలో నిజమవుతాయని చరిత్ర నిరూపిస్తుంది.
అమెరికాతో సహకరించడం వల్ల ఏమిటి జరుగుతుందో తెలుసుకున్న తర్వాత, ప్రభుత్వం పార్లమెంటును ఎలా పక్కన పెట్టగలదు? ప్రభుత్వానికి ఇంతటి నిరంకుశ అధికారాలు రాజ్యాంగ పరంగా ఎలా దఖలు పడ్డాయో పరిశీలిద్దాం.
భారతదేశం 1950లో ఒక గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యంగా ఏర్పడింది.
(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)
భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రు గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి ఏమన్నారంటే, “మన ప్రజాస్వామ్యం బ్రిటిషు వారి వెస్ట్ మినిస్టర్ వ్యవస్థకు సమానంగా ఉంటుంది”. అంటే, కేంద్ర మంత్రులు మరియు ప్రధాన మంత్రి పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి.
(వాస్తవానికి, జవహర్ లాల్ (Jawaharlal Nehru) మరియు ఇందిర గాంధి గారి కాలంలో వారు కూడా పార్లమెంటును పక్కన పెట్టి విదేశీ మరియు దేశ రక్షణ సంబంధిత విషయాలను నిర్వహించవచ్చు, దేశ శ్రేయస్సు దృష్ట్యా. కానీ వారిని ప్రస్తుత రాజకీయ నాయకులతో పోల్చడం సరైనది కాదు కదా!)
నెహ్రూ మరియు ఇందిరా గాంధీ దేశభక్తి ఎప్పుడూ తప్పు పట్టలేనిది. అందువల్ల, వారి నిర్ణయాలు అప్పట్లో వివాదాస్పదంగా మారలేదు. ఆ కాలంలో అంతర్జాతీయ పరిస్థితులు మరియు శక్తి సమీకరణాలు వేరుగా ఉన్నాయి. అప్పటి రష్యా మనకు మద్దతుగా ఉండేది. ఉదాహరణకు, యునైటెడ్ నేషన్స్‌లో ఇంగ్లీష్ వారు కాశ్మీర్‌పై ప్రతీ తీర్మానాన్ని రష్యా వీటో చేస్తూ ఉండేది.
(ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రష్యా ఆర్థికంగా కుదేలయింది. చైనా మనకు వ్యతిరేకంగా మన శత్రువులతో కలిసి ఉంది. ఇప్పుడు భారతదేశం నిజంగా ఒంటరిగా ఉంది. అందువల్ల, విదేశీ వ్యవహారాల్లో న్యూ ఢిల్లీ జాగ్రత్తగా అడుగు వేయాల్సిన అవసరం ఉంది.)
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే, గతంలోకి వెళ్ళాలి.
1937లో ఢిల్లీలో ఎన్నికల ద్వారా కేంద్ర చట్ట సభ ఏర్పడింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఊహించినట్లుగానే, బ్రిటిషు ప్రభుత్వం యుద్ధంలో భారతదేశాన్ని లాగింది.
అప్పుడు కేంద్ర చట్ట సభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. కాంగ్రెసు యుద్ధానికి వ్యతిరేకంగా ఉంది. బ్రిటిషు వారి ఆధీనంలో ఉన్న అప్పటి భారతదేశ ప్రభుత్వం కేంద్ర చట్ట సభను సంప్రదించకుండా జర్మనీపై యుద్ధం ప్రకటించడం, చట్ట సభలకు ప్రభుత్వ దృష్టిలో విలువ లేదని, ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశంలో స్థాపించడంలో చిత్తసుద్ధి లేదని నిరసిస్తూ వారు రాజీనామాలు సమర్పించారు.
1919 సంవత్సరంలో భారతదేశంలో పరిమిత ప్రజాస్వామ్యం కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో అన్ని అధికారాలు భారతదేశంలో గవర్నర్ జనరల్ అనే ఇంగ్లీషు అధికారి చేతిలో ఉండేవి.
1919 సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కేంద్ర చట్ట సభల అధికారాలను నిర్వచించే చట్టం, చట్ట సభల పరిధి నుండి భారతదేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, మత వ్యవహారాలు, విమానయానం, నౌకాదళం వంటి అంశాలను మినహాయించింది. తరువాత 1935 భారత ప్రభుత్వ చట్టం కూడా ఈ అంశాలను పార్లమెంటు పరిధి నుండి మినహాయించింది. ఈ చట్టం 1939 లో కూడా అమలులో ఉంది.
అయినాసరే పైన పేర్కొన్న విధంగా అప్పటి కాంగ్రెసు సభ్యులు రాజనామాలు చేసి, దేశానికి ఏ విధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మున్ముందు ఉండబోతుందో ప్రజలకు చూపించారు అనేది గమనించాలి.
మన పూర్వీకులు మనకు ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలు ఎంత గొప్పవో! కానీ ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానిస్తూ, ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు, పార్లమెంటు సభ్యులు కేవలం చూస్తూనే ఉన్నారు. ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ అధ్యక్షులకు విధేయులుగా, తమ పదవులను కాపాడుకోవడాన్ని జీవితం యొక్క ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
ఇక్కడ మరో అంశాన్ని గమనించాలి. మన ప్రస్తుత రాజ్యాంగం ఆర్టికల్ ౧౩ ప్రకారం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పూర్వపు చట్టాలు ఏవైనా రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవు. అంటే, కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటును తలదన్నే అధికారాలు ఏమి చెల్లవు. పార్లమెంటులో మూడవ వంతు సభ్యులున్న పార్టీ దేశ రక్షణ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహారం నడిపించడం, దేశ రాజకీయ దుస్థితికి నిదర్శనంగా భావించవచ్చు.