శాతవాహనులు

Rate this page

ఆంధ్ర శాతవాహనులు

ఆంధ్ర శాతవాహనులు: …..పై పారాలలో కాకుత్ స్థుల వంశము గురుంచి చెప్పుకున్నాము. కాని కాకుత్ స్థులకు ముందు ఎవరు రాజ్యమేలారు? కాకుత్ స్థులు ఎప్పుడు వచ్చారు. ఈ ప్రశ్నలకు సమాధానం సుదాసు యుద్ధాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. సుదాసుని వశిష్ట మునులు ఇంద్రునిగా నియమించారు. (సుదాసు ముందు దేవదాసు ఉన్నాడు. సుదాసు తరువాత రఘువు, దిలీపుడు, దశరధుడు వంటి వారు ఉన్నారు.)(Satavahanas)

ఈ పేజీలోని అంశాలు నేను వ్రాసిన “ప్రాచీన భారతీయులకు అక్షర సుమాంజలి” అనే గ్రంధంలోని “అపరాజితము” అనే అధ్యాయానికి చెందినవి, 16 లోనివి.

అప్పటివరకు రాజ్యాన్ని నిర్వహిస్తున్న ఇంద్రుడు చివరకు ప్రస్తుత ఇంద్ర ప్రస్థమునకు వెళ్లిపోయాడు. అంటే, అంతకు ముందు అయోధ్య పేరు అమరావతి అయి ఉండాలి. దేవతలకు రాజు ఇంద్రుడు. అతని రాజధాని అమరావతి. ఈ ప్రాంతం కోసలగా మారకమునుపు ఇది ఇంద్రలోకముగా, అదియే దేవలోకమయి ఉంటుంది.

ఇంద్రుడు ఇంద్రప్రస్థమునకు మారిన తరువాత కొంత కాలానికి ప్రస్తుత మహారాష్ట్రలోని అమరావతికి, తరువాత అక్కడినుంచి తీర ఆంధ్రలోని అమరావతికి వలస వెళ్లి ఉండవచ్చు.

శాతవాహనులు

జాతక కథలలో బోధిసత్వుని శార్థవహ అని అంటారని మనం తెలుసుకున్నాము కదా! ఈ శార్థవహ అనే పేరుకు శాతవాహన అనే పేరుకు పద సారూప్యత చాలా దగ్గరగా ఉంది. ఈ శార్దావాహులు కోసల నుంచి వ్యాపారానికి బయలు దేరి విదేశాలకు యాత్రలు చేసే వ్యక్తులు. వీరి వంశం కాలక్రమేణా ప్రస్తుత మహారాష్ట్రకు, తరువాత కోస్తా ఆంధ్రకు విస్తరించిన ఆంధ్రులయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

విశ్వామిత్రుని ఆంధ్రులతో అవినాభావ సంబంధం ఉంది. విశ్వామిత్రుడు కుశ పుత్రుడు. కుశ ధ్వజుల కుశ నాభుల రాజ్యాలు పూర్వపు మత్స్యదేశానికి సరిహద్దుగా ఉన్నాయి. ఈ కుశనాభుల వంశం కూడా ఇక్షుమతీ తీరంలో ప్రారంభమైంది. మళ్ళీ శాతవాహనులలో ఇక్ష్వాకులు కూడా ఉన్నారు. త్రిపురములకు అంబలు ముగ్గురు స్థలదేవీలు. వీరిని కలిపి త్రి అంబలు లేదా త్రయంబలు అని అంటారు.

ఈ ముగ్గురు అంబలను తన భక్తితో కలిగి ఉన్న వ్యక్తి త్రయంబకేశ్వరుడు. ప్రస్తుతానికి మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వరాలయం ఉంది. సర్దవహులు అంటే కోసల రాజ్యవాసులు అని మునుపు చెప్పినట్లుగా, రాముని తరువాత రాజ్యాన్ని పాలించిన సగరుడు, దిలీపుడు పలు అశ్వమేధయాగాలను నిర్వహించాడని చరిత్ర చెబుతుంది. వారు గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించారని తెలుస్తోంది.

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతి, హిందూ సనాతన ధర్మము, వేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

అలా సార్ధావహులు త్రిపురాలను ఏలారు అని అర్థమవుతుంది. త్రిపురలను ఏలినవారు త్రయంబకేశ్వరుని పూజిస్తారుకదా! అలాగే, దక్షిణ భారతదేశంలో శాతవాహనుల మొదటి మజిలీ మహారాష్ట్ర అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అలా చూస్తే, సార్ధవహులు లేక శాతవాహనులు త్రయంబకేశ్వరాలయాన్ని స్థాపించారని నమ్మడానికి కారణం ఉంది.
   ముందు జరిగిన చర్చకు సారాంశం ఈ విధంగా చెప్పవచ్చు. ప్రస్తుత రావి నది పూర్వపు పురుష్ణి, అదే సరయూ. ప్రాచీన కాలంలో సరయూ సదియొడ్డున వెలసిన అయోధ్య నగరమే ప్రస్తుత హరప్పా పట్టణం. ఇక్కడ నివసించిన వివిధ జనులు తరువాత కాలంలో భారతదేశంలోని ప్రధాన భూభాగానికి వలసలు వెళ్లిపోయారు.

అలా వలస వచ్చిన వారిలో త్రయంబకేశ్వరుని తమతో తీసుకువచ్చిన త్రిలింగులు లేదా తెలుగువారు ప్రముఖులు. వీరిని బౌద్ధ రచనలు సార్ధవాహులు అని పేర్కొన్నాయి. (చిత్రం 16.1). పురాణాలు ఆంధ్రులు అని పేర్కొన్నాయి. మరో శాఖ ప్రస్తుత ఉత్తర భారతదేశంలోని సరయు నదీ వద్ద నివాసాలు ఏర్పరచుకున్నాయి. వీరే దక్షిణ ఆసియాలోని బాలి, ఇండోనేషియా, థాయ్ ల్యాండ్ తదితర ప్రాంతాలలో హిందువులను వ్యాప్తి చేశారు. (చిత్రం 16.2)

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswati, సరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavarta, బ్రహ్మావర్తము, Aryanism, ఆర్యజాతి వాదము.)